పనసపండు దొరికితే తప్పక తినండి.. ఈజీగా ఈ సమస్యల నుండి బయట పడచ్చు..!

-

panasapandu : పనస పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పనస పండు దొరికితే ఖచ్చితంగా పనస పండును తీసుకోండి. ఎందుకంటే పనస పండును తీసుకుంటే అదిరే ప్రయోజనాలని పొందవచ్చు. పలు రకాల సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది. పనస పండును తీసుకుంటే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. పనసకాయతో చక్కటి వంటకాలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. పనసకాయతో బిర్యాని, టిక్కీ వంటివి చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. పనస పండులో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్లు వంటివి సమృద్ధిగా ఉంటాయి.

panasapandu
panasapandu

ఒకవేళ కనుక ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే తీసుకోవద్దు. పనసలో రైబోఫ్లావీన్, థైమిన్ వంటి పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం పొటాషియం కాపర్ మాంగనీస్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. పనసను తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్తి సమస్యల్ని పనస దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి పనస ఉపయోగపడుతుంది అలానే గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నుండి పనస బయటపడేస్తుంది. కాబట్టి పక్కాగా పనసని డైట్ లో తీసుకుంటూ ఉండండి.

బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసేందుకు పనస బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. స్ట్రోక్ వంటి ప్రమాదాల నుండి కాపాడుతుంది. విటమిన్ సి ఇందులో ఉంటుంది. ఇది చర్మం నుండి కాపాడుతుంది ఎన్నో రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది దొరికితే తప్పకుండా తీసుకోండి. ఎముకలకి కూడా శక్తిని ఇస్తుంది క్యాల్షియం మెగ్నీషియం ఇందులో ఉంటాయి కనుక ఎముకల ఆరోగ్యంగా ఉండేందుకు అవుతుంది. అయితే పంచదార ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదు లో తీసుకోవడం బెస్ట్. ఇలా మోడరేట్ గా తీసుకుంటే సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news