ఆక్సిజన్‌ మాస్క్‌తో సమంత..

-

తాజాగా సమంత ఆక్సీజన్‌ మాస్క్‌ పెట్టుకున్న ఫోటోను షేర్‌ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఆ మాస్క్‌ పెట్టుకోవడం వెనుక ఉన్న రీజన్‌ను కూడా షేర్‌ చేసింది. హైపర్బేరిక్‌ థెరపీ కోసం సమంత ఆ మాస్క్‌ పెట్టుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సామ్‌ దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి గూగుల్‌లో సర్చ్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ను కూడా పంచుకుంది. పాడైన కండరాలను బాగుచేయడం, కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుంచి హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని తెలుస్తుంది. మయోసైటిల్ వల్ల కణాలు, కండరాలు, బోన్స్ దెబ్బ తిని ఉంటాయని, దాని కోసం బ్లెడ్ సర్క్యూలేషన్ సరిగ్గా అవ్వడానికే ఇలా థెరపీ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Samantha | ఆక్సీజన్‌ మాస్క్‌తో సమంత.. మయోసైటిస్‌ వ్యాధి నుంచి ఇంకా కోలుకోలేదా?

మొత్తానికి సమంత మాత్రం ఇంకా ఆ మయోసైటిస్ నుంచి బయట పడలేదని కనిపిస్తోంది. ఇక సమంత ఇటీవలే నటించిన శాకుంతలం బాక్సాఫీస్‌ దగ్గర బెడిసి కొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ ఖుషీ సినిమాపైనే ఉన్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో పాటు సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది. వరుణ్ ధావణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ది ఫ్యామిలీ మ్యాన్‌ రూపకర్తలు రాజ్‌&డీకే రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో సామ్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. సమంత మయోసైటిస్‌ బారిన పడిన తర్వాత ఎప్పటికప్పుడు తన హెల్త్‌ అప్‌డేట్స్, కోట్స్‌, వ్యాధి వల్ల ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.
నిపించనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news