TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంo సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు.. వారి వద్ద పేపర్ విక్రయించిన వారిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేపర్ లీక్ వ్యవహారంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు పరీక్షలను రద్దు చేయడమో కాకుండా.. మరి కొన్ని పరీక్షలను వాయిదా వేశారు.
అయితే తాజాగా ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో ప్రకటించిన లైబ్రేరియన్ నియామక పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తామని TSPSC అధికారులు తెలిపారు. హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు అనుమానాలు వీడి పరీక్షలకు హాజరుకావాలని కమిషన్, అధికారులు సూచించారు. ఇక నుంచి నిర్వహించే పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోవని స్పష్టం చేశారు.