భారతదేశం గర్వించదగ్గ రీతిలో నూతన సచివాలయం ఉంది : బీఆర్‌ఎస్‌ కువైట్‌ శాఖ

-

బీఆర్‌ఎస్‌ కువైట్‌ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఈరోజు జరిగిన సమావేశం లో ప్రసంగిస్తూ, భారతదేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ నూత‌న స‌చివాల‌యాన్ని అన్ని హంగులతో నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నామకరణం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌ ను ఆమె అభినందించారు. ఈ సచివాలయం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా వెల్లడించారు అభిలాష. తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పలు కట్టడాలను నిర్మించారని అన్నారు ఆమె.

Telangana Secretariat | నూతన సచివాలయం దేశానికే గర్వకారణం : బీఆర్‌ఎస్‌ కువైట్‌ శాఖ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని , అమరుల త్యాగాలను స్మరిస్తూ స్మారక స్థూపం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేశారని తెలియచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ , మిషన్ భగీరథ , దుర్గం చెరువు కేబుల్ వంతెనను నిర్మించారని తెలిపారు . సీఎం కేసీఆర్‌ విజన్‌, పట్టుదల, అకుంఠిత దీక్షకు ఈ నిర్మాణాలు ఒక సాక్ష్యమని అన్నారు అభిలాష గొడిశాల.

 

 

Read more RELATED
Recommended to you

Latest news