ఐపీఎల్ 2023: ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్ స్కోర్ 130 ..

-

ఢిల్లీ మరియు గుజరాత్ టీం ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఏ ఒక్క విషయం లోనూ కలిసిరాలేదని చెప్పాలి. మొదటి బంతికే సాల్ట్ వికెట్ ను కోల్పోయిన ఢిల్లీ అప్పటి నుండి పవర్ ప్లే ముగిసే వరకు కోలుకోలేకపోయింది. పవర్ ప్లే లో ఈ సీజన్ లోనే వరెస్ట్ గా అయిదు వికెట్లు కోల్పోయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. షమీ చెలరేగి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మరియు అమన్ హకీమ్ ఖాన్ లు 6వ వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఏడవ వికెట్ కు హకీమ్ ఖాన్ మరియు రిప్పల్ పటేల్ లు 53 పరుగులు చేసి ఢిల్లీ పరువును కాస్త అయినా కాపాడుకున్నారు.

 

చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ పడుతూ లేస్తూ నిర్ణీత ఓవర్ లలో 130 పరుగులు చేసి కాస్త పరువు దక్కించుకునే పరుగులు అయినా చేయగలిగింది. మరి ఈ స్వల్ప స్కోర్ తో గుజరాత్ ను కట్టడి చేస్తుందా ? కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ మరియు ఇషాంత్ శర్మ లు చెలరేగి బౌలింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news