కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మరో అయిదు రోజుల్లో జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి జోరుగా తిరుగుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ రావాలన్న ప్రయత్నాలలో మునిగి ఉంది. ఇందుకోసం సినీ ప్రముఖులను సైతం ఇక్కడ తెలుగు ప్రజాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో వారితో ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా తెలుగు హస్యబ్రహ్మ బ్రహ్మానందం ను బరిలోకి దించారు. ఈయన చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం లో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న సుధాకర్ ను గెలిపించాలని బ్రహ్మానందం ప్రజలను కోరుతున్నారు. మరి బ్రహ్మానందం ప్రచారం ఫలించి బీజేపీ నాయకుడు గెలుస్తారా లేదా తెలియాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
కాగా బీజేపీకి బలమైన పోటీ ఇచ్చి ఈసారి బీజేపీని ప్రతిపక్షం లో కూర్చో బెట్టాలని కాంగ్రెస్ మరియు ఇతర బీజేపీ వ్యతిరేక పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి కర్ణాటక ఎన్నికలు ఎవరి రాతలను మారుస్తాయి అనేది చూడాలి.