థాయిలాండ్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు… వారే పూర్తి బాధ్యులు : చీకొటి ప్రవీణ్

-

గత వారంలో తెలంగాణకు చెందిన చీకోటి ప్రవీణ్ ను థాయిలాండ్ లోని పటాయా లో థాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈయనతో పాటుగా ఇంకా చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ 100 ల కోట్ల గ్యంబ్లింగ్ లోసూత్రదారి అయిన కారణంగా ప్రవీణ్ ను అరెస్ట్ చేశారని.. తప్పంతా ప్రవీణ్ దే అని వివుడ రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే అస్సలు విషయం ఏమి జరిగింది అనేది ప్రవీణ్ స్వయంగా చెప్పాడు. నన్ను ఏదో విధంగా పాతాళానికి అణగదొక్కాలి అన్న కుట్రతో నాపై ఈ నేరారోపణలు మరియు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. నన్ను దేవ్ మరియు సీత అనే ఇద్దరూ పటాయలో జరిగే పోకర్ పోటీలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానం పంపించారు. పైగా విదేశాల నుండి చాలా మంది ప్లేయర్స్ వస్తారు అని చెప్పారు అని ప్రవీణ్ చెప్పారు. తెలంగాణ నుండి ఒంటరిగానే వెళ్లడం జరిగింది, ఎవరినీ నా వెంట తీసుకువెళ్ళలేదు అని చెప్పారు. అక్కడ అనుకోకుండా థాయ్ పోలీసులు దాడులు జరిపారు.

అప్పటి వరకు కూడా అసలు నా చుట్టూ ఏమి జరుగుతోంది అనేది అర్దం కాలేదని తెలిపాడు. ఈ కేసుకు మరియు మీరు అనుకుంటున్నట్లు ఈ గ్యాంబ్లింగ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు.. నన్ను ఆహ్వానించింది దేవ్ మరియు సీతలు.. వీరిద్దరే ఈ పోకర్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది అని చెప్పారు. పోలీసులకు దొరికిన తర్వాత దేవ్ మరియు సీతలు నాకు ఈ కేసుతో సంబంధం లేదని కూడా చెప్పారు. ఈ స్టేట్మెంట్ ను పోలీసులు నోట్ చేసుకున్నారు. పైగా నేను పోలీసులకు 50 లక్షలు ఇచ్చానని మరో వార్త ప్రచారంలో ఉంది…వాస్తవానికి ఇక్కడ చట్టాలు చాలా కటినంగా ఉంటాయి. పోలీసులకు రూపాయి లంచంగా ఇచ్చే పరిస్థితి ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు. నేను కేవలం 2000 బాత్ లు మాత్రమే ఫైన్ గా చెల్లించినట్లు చెప్పారు. కాబట్టి ఇకనైనా నా పైనే తప్పుడు రాతలు రాయడం ఆపండి అంటూ ప్రవీణ్ మీడియా మిత్రులు అందరినీ వేడుకున్నారు. మీకు సౌలభ్యం ఉంటే నిజమైన వార్తలను ప్రజలకు చేర్చడానికి ప్రయత్నించండి … నా తప్పు లేకుండా నన్ను దోషిగా చిత్రీకరించే ప్రయ్నత్నాలు ఆపాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news