నేడు చంద్రగ్రహణం.. భారత్​లో కనిపిస్తుందా..?

-

ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుత ఆవిష్కృతాన్ని చూసేందుకు యావత్ ప్రపంచం వేచి చూస్తోంది. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కే అవకాశం లేదు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటి..? మీ ప్రాంతంలో ఆ అద్భుతం కనిపిస్తుందా..? ఓసారి తెలుసుకుందామా..?

ఖగోళంలో ఇవాళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ‘పెనుంబ్లార్‌ లూనార్‌’గా పిలిచే చంద్ర గ్రహణం ఏర్పడనుందని ప్లానెటరీ సొసైటీ, ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీ రఘునంద న్‌కుమార్‌ తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8.42 గంటల నుంచి 1.04 గంటల వరకు ఉంటుందని అన్నారు.

అయితే ఇది భారతదేశంలో కనిపించదని చెప్పారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్‌ వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. దాని ప్రభావం భారత్‌లోనూ ఉంటుందంటూ వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావాలు ఉంటాయని చేసే ప్రచారాలను నమ్మొద్దని శ్రీ రఘునందన్‌ కుమార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news