రజినీకాంత్ జైలర్ మూవీ.. అదిరిపోయే గ్లింప్స్ తో లేటెస్ట్ అప్డేట్..

-

రజినీకాంత్: కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం జైలర్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం ఓ లేటెస్ట్ అప్డేట్ ను ఇచ్చింది.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ ను విడుదల చేసింది. చిత్ర బృందం ఆగస్టు 10 ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్​ డేట్​ అనౌన్స్​మెంట్​ ట్యాగ్​తో 47 సెకన్ల వీడియో గ్లింప్స్​ను విడుదల చేశారు.

బీస్ట్ మూవీ ని తెరకెక్కించిన దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ స్టార్​ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. గ్లింప్స్ వీడియోలోనూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​తో అనిరుధ్ అదరగొట్టాడు. ఇక రజినీకాంత్​ సరసన తమన్నా భాటియా హీరోయిన్​గా నటిస్తోంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, కమెడియన్ సునీల్​ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన గ్లింప్స్​ వీడియోలో సూపర్​ స్టార్​ రజినీ తన ఎంట్రీతో అదరగొట్టారు. తనదైన స్టైల్‌లో కారు నుంచి దిగుతూ కనిపించారు. బ్లూ షర్ట్​, కళ్లజోడుతో రజినీ లుక్స్​ అదిరిపోయాయి. ఈ చిన్న గ్లింప్స్‌లోనే కన్నడ హీరో రాజ్ కుమార్, మలయాళ స్టార్​ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్‌తో పాటు సునీల్​ క్యారెక్టర్‌ను చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news