నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పేరుతో నేడు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వాట్సాప్ గ్రూప్ లో వైరల్ అవుతుందని మా దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా తప్పుడు నోటిఫికేషన్ అని టిఎస్ఎన్ఎపిడిసిఎల్ సి.యం.డి అన్నమనేని గోపాల్ రావు తెలిపారు. టీఎస్ ఎస్ పిడిసిఎల్ ఎటువంటి నోటిఫికేషన్ జారీ చెయ్యలేదు. ఎన్ పిడిసిఎల్ ఏ నోటిఫికేషన్ జారీ చేసినా అట్టి నోటిఫికేషన్ కంపెనీ వెబ్సైట్ www. tsnpdcl. in లో పెట్టడం జరుగుతుందని ఎప్పటికప్పుడు వెబ్సైట్లోని “కెరియర్స్”లో నోటిఫికేషన్లను చూసి నివృత్తి చేసుకోవాలని సి. యం.డి కోరారు.
పత్రికా ముఖంగా ఉద్యోగ ఆశావాహులకు తెలియజేయునది ఏమనగా ఎటువంటి పోస్టుల భర్తీలనైనా సంస్థ వెబ్సైట్ లో చూసి నిర్ధారించుకోవాలని, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సంస్థ అధికారికంగా జారీ చేయడం జరుగుతుందని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు.