ఎడిట్ నోట్: పొంగులేటి ‘పార్టీ’ సాధ్యమేనా?

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన ఖమ్మం జిల్లాలో సొంతంగా రాజకీయం నడిపిస్తున్నారు. తనకు లాగే బి‌ఆర్‌ఎస్ లో ప్రాధాన్యత దక్కని వారిని ఏకం చేసి..జిల్లాపై పట్టు సాధించే దిశగా వెళుతున్నారు. ఖమ్మంలోనే కాదు..రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్‌ని చావు దెబ్బ తీయాలని చూస్తున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. ఇక ఇద్దరికీ రాజకీయంగా బలంగా ఉంది..అందుకే ఈ ఇద్దరిని తమ పార్టీల్లోకి లాగాలని అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పి ట్రై చేస్తుంది. ఇటీవల ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కొందరు బి‌జే‌పి నేతలు..పొంగులేటి, జూపల్లిలని కలిసి..బి‌జే‌పిలోకి రమ్మని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతలు పార్టీలో చేరికపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సమయం చూసుకుని చెబుతామని అన్నట్లు మాట్లాడారు. ఇక ఈ ఇద్దరు నేతలు బి‌జే‌పిలోకి వెళ్తారా? లేక కాంగ్రెస్ లోకి వెళ్తారా? అనే అంశం..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలనుంది.

అదే సమయంలో పొంగులేటి కొత్త పార్టీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్‌ఎస్‌) పేరుతో ఎన్నికల కమిషన్‌ వద్ద ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్‌ అయింది. ఆ పార్టీని పొంగులేటి అనుచరులే రిజిస్టర్‌ చేయించినట్లు తెలిసింది. ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో తన అనుచరులను బరిలోకి దించే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయా స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ లో ఉంటూ ప్రాధాన్యత లేకుండా ఉన్నవారిని ఏకం చేసి..వారికి సీట్లు ఇవ్వాలని చూస్తున్నారు.

అలా చేసి బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టడమే పొంగులేటి టార్గెట్. అయితే కొత్త పార్టీ పెట్టి సక్సెస్ అవ్వడం కష్టం. మహా అయితే పొంగులేటి, జూపల్లి లాంటి వారికి గెలిచే ఛాన్స్ ఉంటుందేమో గాని..మిగతా వారు గెలవడం కష్టం. కానీ ఓట్లు చీల్చి బి‌ఆర్‌ఎస్ కు డ్యామేజ్ చేస్తారు. చూడాలి మరి పొంగులేటి రాజకీయం ఎలా ఉంటుందో? కొత్త పార్టీ పెడతారా? లేక వేరే పార్టీలో చేరతారో?

Read more RELATED
Recommended to you

Latest news