ఐపిఎల్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సరైన సమయంలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా తో జరిగిన మ్యాచ్ లో 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.1 ఓవర్ లలోనే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేధించి రికార్డు సాధించింది. మామూలుగా ఈడెన్ గార్డెన్స్ లో 200 కు పైగా టార్గెట్ అయినా కాపాడుకోవడం చాలా కష్టం, అలాంటిది ఈ చిన్న టార్గెట్ రాజస్థాన్ కు సరిపోలేదు. మొదటి బంతి నుండి రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ లో రాణా బౌలింగ్ లో 24 పరుగులు పిండుకున్నాడు.
జైస్వాల్ 98 పరుగులు చేసి చివర వరకు నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని సంజు శాంసన్ 48 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. ఈ విజయంలో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుతుంది. అలా రాజస్థానన్ పరుగుల వరదలో కోల్కతా కొట్టుకుపోయింది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలు కష్టమే అని చెప్పాలి.