గత ఎన్నికల్లో 30-40 సీట్లలో గెలిపించి ఉంటే..ఇప్పుడు సీఎం పదవి డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉండేది..కానీ అలా జరగలేదు..అయినా తనకు సీఎం పదవి ఇవ్వాలని టిడిపి వాళ్ళు ఎందుకు అనుకుంటారు..వాళ్ళ ప్లేస్ లో ఉంటే తాను కూడా అంతే..కాబట్టి తనకు సీఎం పదవి కాదు కావాల్సింది..వైసీపీని గద్దె దించడం కావాలి..కాస్త అటు ఇటూగా పవన్ చెప్పిన మాటలు ఇవే. టిడిపితో పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.
కానీ దీనిపై టిడిపి ఏ మాత్రం స్పందించడం లేదు. ఈ క్రమంలోనే పవన్ స్పందిస్తూ..సిఎం పదవి డిమాండ్ చేయననే చెప్పేశారు. తన డిమాండ్ వైసీపీ గద్దె దిగడం అని అన్నారు. దీంతో జనసేన శ్రేణుల ఆశలు నీరు కారాయి. ఎవరికి వారు నిరాశ చెందారు. ఇదే తరుణంలో టిడిపి-జనసేన పొత్తుని దెబ్బ తీయడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్న వైసీపీ..పవన్ పై ఎటాక్ మొదలుపెట్టింది. ఫ్యాన్స్, కాపులు ఓట్లని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని, సిఎం పదవి వద్దు, ప్యాకేజ్ ముద్దు అని అనుకుంటున్నారని, పవన్ పూజకు పనికిరాని పువ్వు అంటూ వైసీపీ నేతలు పంచ్‌లు వేస్తున్నారు. పవన్ ఇమేజ్ గాలి బుడగ లాంటిది అని సజ్జల లాంటి వారు అంటున్నారు. మొత్తానికి వైసీపీ పవన్‌ని గట్టిగా టార్గెట్ చేస్తుంది. అదే సమయంలో పవన్‌ని నమ్ముకుంటే వేస్ట్ అని, కాపు ఓటర్లు జగన్‌కు మద్ధతు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.
ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్, కాపులు కాస్త ఆలోచనలో పడ్డారు. ఇంతకాలం వారు పవన్ సిఎం సిఎం అని నినాదాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సిఎం వద్దు అంటున్నారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో కాపు ఓటర్లు ఎటువైపుకు టర్న్ తీసుకుంటారో చూడాలి. వారిని లాగాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. చూడాలి మరి కాపు ఓటర్లు ఎవరి వైపు ఉంటారో.