టీడీపీ అధినేత చంద్రబాబు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు. తాను పర్యటనకు వస్తే మండుటెండలు కూడా లెక్కచేయకుండా వేలమంది రైతులు వచ్చారని, ఇరగవరం నుంచి తణుకు వరకు తనతో పాటు పాదయాత్ర చేశారని చంద్రబాబు వెల్లడించారు.
“అకాల వర్షంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం జగన్ కు ఏమాత్రం పట్టడంలేదు. రైతు సంక్షోభంలో ఉంటే ఈ సీఎంకు పరామర్శించే తీరిక లేదా? రైతులు పంట నష్టపోయి బాధపడుతుంటే వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది. చేతగాని, అసమర్థ ప్రభుత్వం వల్లే ఇన్ని అనర్థాలు అని అన్నారు చంద్రబాబు.
ఇది ఇలా ఉంటె, నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించే ప్రభుత్వం మాది. 4 ఏళ్లుగా రైతులకు అండగా ఉంటున్నాం. రైతులకు చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. రైతులకు మేలు జరుగుతుందనే కొంతమంది ఓర్వలేక రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతుబాంధవుల వేషం వేశారు. ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారు. వీళ్ల డ్రామాలు నమ్మకండని’ జగన్ ప్రజలకు సూచించారు.