నారా లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ధ వెంకన్న అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో వెంకన్న మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర దిగ్వి జయంగా 100 పూర్తి అయ్యిందని చెప్పారు. జగన్ పాదయాత్ర మార్నింగ్, ఈవినింగ్ వాక్‌గా ఉండేదని అన్నారు. లోకేష్ పాదయాత్రతో భారత దేశంలో చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్న కులాలను లోకేష్ కలుస్తున్నారన్నారు.
జగన్ పిచ్చి గుడివాడ అమర్‌కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్ కంటే…తన తోనే ఎక్కువ మంది సెల్ఫీ లు తీయంచుకుంటారని ఒక ఇంటర్వ్యూ లో గుడివాడ చెప్పారని పేర్కొన్నారు. పవన్ వచ్చినప్పుడు అనకాపల్లి సెంటర్లో అమర్నాథ్ నిల్చుంటే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని ఎద్దేవా చేశారు. అమర్నాధ్ ఒన్ టైం ఎమ్మెల్యే..మళ్లీ గెలవడన్నారు. గుడివాడ అమర్నాథ్ వలన విశాఖలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు.జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని బుద్దా అన్నారు.