ఫ్యాక్ట్ చెక్: టెంపరరీగా బ్యాంక్ అకౌంట్ లాక్.. స్టేట్ బ్యాంక్ ఏం అంటోంది అంటే..?

-

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మితే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజుల్లో నకిలీ వార్తలు సోషల్ మీడియాలో మనకి విపరీతంగా కనపడుతున్నాయి. చాలామంది నకిలీ వార్తలను నిజం అని భావించి మోసపోతున్నారు జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నోరకాల సేవలను అందిస్తోంది.

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి అకౌంట్ టెంపరరీగా లాక్ చేసామని సస్పిసియస్ యాక్టివిటీ కింద ఇలా జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నాయి. అయితే మరి కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజంగా ఇలాంటి మెసేజ్లు ని పంపుతోందా..? ఇది నమ్మొచ్చా ఇందులోని నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మెసేజ్లు ని ఖాతాదారులకి పంపించడం లేదు పైగా ఈ మెసేజ్ తో పాటుగా ఒక లింకు కూడా వస్తోంది ఈ లింక్ ని కనుక అనవసరంగా క్లిక్ చేస్తే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఇది వట్టి నకిలీ వార్త అని తెలిసిపోతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మెసేజ్లు ని ఖాతాదారులకి పంపడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇలా లింక్ మీద క్లిక్ చేయండి అని మెసేజ్ ని పంపించదు ఒకవేళ కనుక ఇలాంటి నకిలీ వార్తలు వస్తున్నట్లయితే అవాయిడ్ చేయడం మంచిది అంతేకానీ అనవసరంగా లింక్ మీద క్లిక్ చేసి ఇబ్బందులు పడకండి.

Read more RELATED
Recommended to you

Latest news