అన్న పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!

-

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు ఆమె విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తుండగానే.. ఆమె అన్న మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ కూడా వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు లావణ్య త్రిపాఠితో వచ్చే నెలలో ఘనంగా నిశ్చితార్థం జరగబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో వార్తలు నిజమేనని అందరూ నమ్మరు. కానీ తాజాగా నిహారిక ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది.

తాజాగా నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తున్న డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ఈరోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఒక ప్రశ్న ఎదురయింది. అదేంటంటే మీ అన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నారంట కదా? నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అంట కదా నిజమేనా? అని ఆన్సర్ దానికి స్పందిస్తూ నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు కేవలం నా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను అంటూ ఖరాకండిగా చెప్పింది.

నిహారిక మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో నిజంగానే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.ఇవి చూసిన కొంతమంది నిహారిక వార్తలను కొట్టి పారేయడానికి లేదు.. ఆమె తన అన్న పెళ్లి గురించి ప్రస్తావించలేదు అంటే వీరి పెళ్లిని పెద్దలు అధికారికంగా అనౌన్స్ చేస్తారని తాను సైలెంట్ గా ఉందేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news