కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. రేపు కీ విడుదల

-

రేపు( మే 22న) పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ ని విడుదల చేయనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్, ఐటి తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ ని www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యంతరాలను 24 మే సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని సూచించింది. ఇందుకు కోసం ప్రత్యేక ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదుచేయాలని.. ఇందుకు సంబంధిచిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని తెలిపింది.

TSLPRB Constable Prelims Exam 2022 Answer Keys Released

అభ్యంతరాలకు ప్రత్యేకంగా ప్రోఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్‌ కీని విడుదల చేసే సమయంలో ఓఎంఆర్‌ షీట్లు లాగిన్‌లో ఉంచనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 30న తుది విడుత రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. ఇందులో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news