Breaking : ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్‌

-

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశాయని, వారు ఒక రహదారిపై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. వీరిలో ఇద్దరు తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డులు ఉన్నట్లు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క 30వ బెటాలియన్ సంయుక్త బృందం సిఆర్పిఎఫ్ యొక్క చిల్పరస్ శిబిరం నుండి శోధన/ఏరియా డామినేషన్ ఆపరేషన్ ప్రారంభించింది.

Chhattisgarh: Maoists Kill Two Villagers In Separate Incidents

అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తరువాత వీరికి ముగ్గురు మావోయిస్టులు కనిపించారు. తమను చూసి తప్పించుకుని పోవటానికి ప్రయత్నించిన ఆ ముగ్గురిని డీఆర్జీ, సీఆర్పీఎఫ్​బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి ఓ వాకీటాకీ, టార్చిలైట్, ఆరువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శలభ్​కుమార్​సిన్హా వెల్లడించారు. పట్టుబడిన మావోయిస్టుల్లో ఉత్తర బస్తర్​5వ డివిజన్​కంపెనీలోని సెక్షన్​ఏకు డిప్యూటీ కమాండర్​గా వ్యవహరిస్తున్న పీలూరాం అంచల ఎలియాస్​సాలిక్ రాం (35), డివిజన్​మెంబర్​గా ఉన్న పనావు రాం మండవి (22), రమేశ్​పూనెమ్​ఎలియాస్​బద్రూ (25) ఉన్నట్టు ఆయన చెప్పారు. వీరిలో పీలూరాం, పూనెమ్​లపై ప్రభుత్వం ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రివార్డులు ప్రకటించిందని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news