ఎన్నో వివాదాల తర్వాత పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరయ్యే పార్టీలు ఇవే…

-

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లేటెస్ట్ గా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమైంది. కాగా ఈ ఓపెనింగ్ కు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ జాతీయ మరియు స్థానిక పార్టీలలో ఎన్ని హాజరు కానున్నాయి అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఓపెనింగ్ పై బీజేపీ వ్యతిరేక పార్టీలు విమర్శలు చేస్తూ ఓపెనింగ్ కు వచ్చేది లేదని తేల్చి చెప్పాయి. అందులో మొత్తం 20 పార్టీలు ఉన్నాయి, హాజరు కానున్న పార్టీలను చూస్తే ఎన్డీఏ కూటమిలో భాగం అయిన బీజేపీ తో కలుపుకుని 18 పార్టీలు, అదే విధంగా నాన్ ఎన్డీఏ కూటమిలోని లోక్ జనశక్తి పార్టీ, బిజూ జనతాదళ్ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ, వైసీపీ, అకాలీదళ్ , జనతాదళ్, సెక్యులర్ పార్టీలు హాజరు కానున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణ పార్టీ BRS మాత్రం ఇంకా ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వక పోవడం గమనార్హం. ఎన్నో వివాదాల తర్వాత చాలా వరకు పార్టీలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news