111 జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి పెను ప్రమాదం – కిషన్‌ రెడ్డి

-

తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై సిఎం కేసీఆర్ కు సోయి లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. 111 జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి ఎప్పుడైనా ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉందని ఆగ్రహించారు. నీతి అయోగ్ 8వ సమావేశానికి సిఎం కేసీఆర్ హాజరు కాలేదు.. టీమ్ ఇండియా స్పిరిట్ తో సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు.

నీతి ఆయోగ్ సమావేశం కన్నా సిఎం కేసీఆర్ కి అతి ముఖ్యమైన పని ఏముంది? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సిఎం కేసీఆర్ కి సోయి లేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి… అప్పులు ముంచుకొస్తున్నాయని హెచ్చరించారు. ఆదాయానికి మించి సిఎం కేసీఆర్ అప్పులు చేశారు.. కేసీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదని నిప్పులు చెరిగారు. భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని.. అసైన్డ్ భూములను అమ్ముకుంటున్నారన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే 111 జీవో రద్దు చేశారని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news