కష్టపడకుండా డబ్బు వస్తే.. ఎవ్వరైనా సంతోషిస్తారు.. మనం రోడ్డుపై వెళ్తుంటే.. పది రూపాయలు కనిపించినా ఎక్కడలేని ఆనందం వస్తుంది కదా.. కానీ రోడ్డుపై డబ్బు దొరకడం అనేది దేనికి సంకేతం.. శుభమా, అశుభమా..? మళ్లీ డౌట్ ఏంటండీ.. డబ్బులు దొరకడం శుభమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పండితులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దామా..!
దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడో రోడ్డుపై నాణేలు, కరెన్సీ నోట్లు దొరికిన సందర్భాలు చాలానే ఉంటాయి. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక ఊహించని అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్ని ఇస్తుంది. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బు దొరకడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది, అలా దొరకడం అదృష్టమా లేక దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డుపై డబ్బు కనిపిస్తే
రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న నాణెం మీకు కనిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే, మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారట. చైనాలో అయితే, డబ్బు లేదా నాణేలు నగదు రూపంగా మాత్రమే భావించరు. వాటిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు.
పనిలో విజయం
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే, మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారట..
ఆర్థిక ప్రయోజనం
మీరు పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు పడి ఉంటే, మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఖర్చు చేయవద్దు
మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి. లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు, కానీ వాస్తుశాస్త్రం ప్రకారం.. ఆ డబ్బును ఖర్చు చేయకూడదట..
కొత్త పని ప్రారంభానికి సంకేతం
దారిలో పడిపోతున్న నాణేలను మీరు చూస్తే, త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని, ఆ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని సంకేతమట.!
రోడ్డు మీద డబ్బు దొరికితే ఇన్ని అర్థాలు ఉంటాయా.. మనం ఇన్ని రోజులు తీసి పర్సులో పెట్టుకున్నామే కానీ.. అసలు ఇవన్నీ ఆలోచించలే కదా..!