పబ్​లో వన్యప్రాణుల ప్రదర్శన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

-

హైదరాబాద్‌ మహానగరంలో పబ్ కల్చర్ విశృంఖలంగా మారుతోంది. ఇప్పటికే సమయాన్ని మించి తెల్లవార్లూ భారీ శబ్ధాలతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తూ పబ్ యాజమాన్యులు రెచ్చిపోతున్న ఘటనలు ఎన్నో. ఇక తాజాగా ఓ పబ్​లో ఏకంగా వన్య ప్రాణులను తీసుకువచ్చి హల్​చల్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్బులో వన్యప్రాణులను ప్రదర్శించారు. పబ్​లోకి వచ్చిన యువతీయువకులు ఆ వన్యప్రాణాలతో డ్యాన్స్ చేస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. వాటితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాటితో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

పబ్‌కు వచ్చినవారు వన్యప్రాణులతో ఆటలాడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో విమర్శలు చెలరేగాయి. విషయం బయటకు రావడంతో కొందరు వ్యక్తులు… పోలీసులు, అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వన్యప్రాణులను పబ్బులో ప్రవేశపెట్టి ఆటవికంగా ప్రదర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news