‘మ్యాన్ విత్ డెడ్లీ ప్లాన్’.. ధోనీపై సీఎం స్టాలిన్ ప్రశంసలు

-

ఐపీఎల్ 2023 సీజన్‌ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టుతోపాటు ఎంఎస్‌ ధోనీ నాయకత్వంపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరింపిచి మరీ ఐదో కప్‌ను సీఎస్‌కే సొంతం చేసుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మాజీ ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు పోస్టులు పెట్టారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ధోనీపై ప్రశంసలు కురిపించారు.

‘‘సీఎస్‌కే జట్టుకు శుభాకాంక్షలు. ప్రతి పరిస్థితికి పక్కా ప్రణాళిక ఉండే ధోనీ నాయకత్వంలో ఐదోసారి కప్‌ను నెగ్గడం బాగుంది. చరిత్రాత్మక విజయంలో రవీంద్ర జడేజా తన అసాధారణ పోరాటంతో కీలక పాత్ర పోషించాడు’’ – ఎంకే స్టాలిన్ – తమిళనాడు ముఖ్యమంత్రి

‘‘ఐపీఎల్‌ సీజన్‌కు అద్భుతమైన ముగింపు. రెండు జట్లూ (చెన్నై, గుజరాత్) విజయం కోసం అద్భుతంగా పోరాడాయి. చెన్నై లోతైన బ్యాటింగ్‌ ఆ జట్టును విజేతగా నిలిపింది. తొలి నుంచీ ఇరు జట్లూ సూపర్‌గా ఆడాయి. ఎంఎస్ ధోనీకి, సీఎస్‌కే జట్టుకు అభినందనలు’’ – సచిన్ తెందూల్కర్

Read more RELATED
Recommended to you

Latest news