బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ శుభవార్త..వారి భృతి రూ.10 వేలకు పెంపు

-

బ్రాహ్మణ సంక్షేమ భవన్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వారికి శుభవార్త చెప్పారు. ప్రతినెల పేద బ్రాహ్మణులకు ఇచ్చే భృతి ని 2500 నుంచి 5000 లకు పెంచుతున్నామని.. దీప దూప నైవేద్యం కోసం ఇచ్చే 6 వేల ను పది వేలకు పెంచుతున్నామని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. ఫీజ్ రీ అంబర్స్ మెంట్ ఇచ్చే విషయంలో కూడా ఆలోచిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.

అనేక పీఠాల నుంచి వచ్చిన పీఠాధిపతులకు పాదాభివందనాలు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి అర్చకులకు వందనాలు తెలిపారు. బ్రహ్మ జ్ఞానం పొందిన వారికి బ్రహ్మనిజం సిద్ధిస్తుందని.. కులానికి పెద్దది అయినా బ్రాహ్మణులలో చాలా మంది పేదలు ఉన్నారని వివరించారు. వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం150 కోట్లు వేచించమని.. 12 కోట్ల తో 9 ఎకరాల్లో బ్రాహ్మణ సదన్ నిర్మించామని చెప్పారు. దేశంలోనే మొట్ట మొదటి బ్రాహ్మణ సధనం ఇది… సూర్యాపేట లో కూడా త్వరలోనే బ్రాహ్మణ సదన్ నిర్మించుకుందామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news