అసద్‌ వర్సెస్ బండి..అదిరే సవాల్..కేసీఆర్‌కు రిస్క్.!

-

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే త్రిముఖ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య వార్ నడుస్తుంది. ఎవరికి వారు అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే బి‌జే‌పి అనూహ్యమైన వ్యూహాలతో రాజకీయం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎం‌ఐ‌ఎంని స్టార్ట్ చేసింది.

మొదట నుంచి ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పిల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో ఎలాంటి వార్ జరిగిందో తెలిసిందే. తాజాగా ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని అమిత్ షా అంటారని.. అదే నిజమైతే పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాట్లాడితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బెదిరిస్తున్నారని, దమ్ముంటే భారత భూభాగంలోకి వస్తున్న చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు.

ఇక వెంటనే అసద్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చేశారు. ముస్లింల జీవితాల్ని ఎంఐఎం నాశనం చేస్తోందని, బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని ఎంఐఎం చూస్తోందని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం ఎంఐఎంకు అలవాటేనని, ముస్లిం సమాజం ఎంఐఎంను చీదరించుకుంటోందని అన్నారు. అసదుద్దీన్‌కు దమ్ముంటే తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చెయాలని సవాల్ విసిరారు.

అయితే అసద్ ఆ సవాల్ స్వీకరించి బరిలో ఉంటే కే‌సి‌ఆర్‌కే నష్టం..ఎందుకంటే ఎం‌ఐ‌ఎం పరిధి కేవలం పాతబస్తీ వరకే..అక్కడున్న 7 సీట్లని ఎం‌ఐ‌ఎం ఎప్పుడు గెలుచుకుంటుంది. మిగతా స్థానాల్లో పోటీ చేయదు…చేసిన గెలవదు. కాకపోతే ఎం‌ఐ‌ఎం గాని పోటీ చేస్తే ఆయా స్థానాల్లో ఉండే ముస్లిం ఓట్లలో చీలిక వస్తుంది. అప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్‌కు నష్టమే. ఇక ఓట్ల చీలికతో తమకు లాభమని బి‌జే‌పి చూస్తుంది. మరి అసద్ బండి సవాల్ స్వీకరిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news