ఈ ఆయుర్వేద చిట్కాలతో… వేసవి వేడి వలన ఇబ్బందులే వుండవు..!

-

ఆయుర్వేద చిట్కాలతో: ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. హీట్ స్ట్రోక్ మొదలు రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి.వేసవికాలంలో ఆరోగ్యం పై దృష్టి తప్పక పెట్టాలి వేసవికాలంలో డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. అలానే వేసవికాలంలో వడదెబ్బ కొట్టకుండా ఇంటిపట్టునే ఉండడం మొదలైన చిట్కాలని అనుసరిస్తూ ఉండాలి. వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద నిపుణులు చెప్పిన ఈ అద్భుతమైన సూత్రాలను తప్పక పాటించండి అప్పుడు కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది వేసవికాలంలో వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.

వేసవికాలంలో ఎండలు మండిపోతు ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎండ విపరీతంగా కాస్తుంది అటువంటప్పుడు మధ్యాహ్నం పూట చల్లటి ప్రదేశం లో నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు కాబట్టి మధ్యాహ్నం పూట వేసవిలో కాసేపు నిద్రపోండి. భోజనం తినేసిన తర్వాత ఒక గంట సేపు ఆగి ఆ తర్వాత నిద్ర పోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు వేసవికాలంలో రాత్రిళ్ళు తక్కువగా పగటిపూట ఎక్కువగా ఉంటుంది పనులన్నీ కూడా ఉదయాన్నే త్వరగా మొదలు పెట్టేస్తూ ఉంటారు. అందుకని మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం నాలుగు లోపు ఒక 30 నిమిషాల పాటు రిలాక్స్ గా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది.

బయటకు వెళ్లాలంటే రాత్రి పూట లేదంటే చల్లబడిన తర్వాత సాయంత్రం పూట చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్లో పెట్టిన నీళ్లు కాకుండా చల్లగా కుండా నీళ్లు వంటివి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కొత్తిమీర పుదీనా గులాబీ వంటి వాటిని నీళ్లలో కలిపి తీసుకుంటే బాగుంటుంది. సన్ స్ట్రోక్ వంటివి రావు. బిల్వ తో చేసిన షర్బత్, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, సత్తు, గుల్కండ్ వంటివి కూడా వేసవిలో తీసుకోవచ్చు. ద్రాక్ష పండ్లు, పుచ్చకాయ, దానిమ్మ వంటి వాటిని వేసవికాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news