రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో నేతకు ఒక్కో వ్యూహం ఉంటుంది..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి..అందులో కేసిఆర్ వ్యూహాలు వేరు..చంద్రబాబు వ్యూహాలు వేరు..జగన్ వ్యూహాలు వేరు..ఇలా ఎవరికి వ్యూహాలు వారికి ఉంటాయి. కానీ ఇక్కడ కొందరి వ్యూహాలు ప్రత్యర్ధులకు అర్ధమైపోతాయి..అవి అంతగా ఎఫెక్ట్ చూపలేవు. అలా అర్ధమయ్యేది చంద్రబాబు వ్యూహాలే.
ఇక కేసిఆర్ వ్యూహాలు డిఫరెంట్..ఆయన వ్యూహాలకు ప్రత్యర్ధులు దెబ్బతినాల్సిందే. అదే సమయంలో జగన్ వ్యూహాలు అసలు అంతుచిక్కవు. కనీసం కేసిఆర్ వ్యూహాలు వేస్తున్నారని తెలుస్తుంది..కానీ జగన్ అలా కాదు..ఆయన వ్యూహం రచిస్తున్నట్లే తెలియదు. వ్యూహం వేయడం, ప్రత్యర్ధి చిత్తు అయిన ఎప్పటికో..అవి జగన్ వేసిన వ్యూహాలని అర్ధమైపోతాయి. అంటే జగన్ రాజకీయం అలా ఉంటుంది. అలాగే ఆయన మైండ్ గేమ్ సైతం చాలా వేరుగా ఉంటుంది. ఓ వైపు ప్రజలని ఆకర్షిస్తూనే..మరోవైపు ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విధంగా రాజకీయం నడిపిస్తారు.
ఇటీవల కాలంలో ఆయన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. పేదల వైపు తాను, పెత్తందార్ల వైపు చంద్రబాబు, పవన్ ఉన్నారనే అర్ధంతో ఆయన మాట్లాడుతున్నారు. అయితే అదే మాటని పదే పదే చెబుతున్నారు..అలాగే రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. అంటే ఆ అంశం ప్రజల్లోకి వెళ్లాలని ఇలా ప్లాన్ చేశారు. పదే పదే చెప్పడం వల్లే ప్రజల్లోకి ఎక్కువ వెళుతుంది. ఇక ఇదే జగన్ విన్నింగ్ ఫార్ములా అని చెప్పవచ్చు.
ఇక బాబు-పవన్ పొత్తులో వెళుతున్నారు. వారు పొత్తులో వెళితే జగన్ ఓడిపోవడం ఖాయమనే ప్రచారం ఉంది. అందులో కాస్త వాస్తవం కూడా ఉంది. కానీ ఆ పొత్తుని దెబ్బతీయడానికి జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ వేరు. తాను ప్రజలకు మంచి చేస్తూ ఒంటరిగా పోరాడుతున్న అనే అంశాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. బాబు-పవన్ ఏమో అధికారం కోసం కలిసొస్తున్నారని చెబుతున్నారు. ఇలా చెప్పడం కూడా ఓ గేమ్. అయ్యో జగన్ ఒంటరిగా పోరాడుతున్నారని ప్రజలు సెంటిమెంట్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఇదే జగన్ మైండ్ గేమ్..ఆయన విన్నింగ్ రూట్ కూడా ఇదే.