సీఎం కేసీఆర్..ఓ చేతికాని దద్దమ్మ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. రైతులను నిండా ముంచి, ఓట్ల కోసం “రైతు దినోత్సవం” నిర్వహించిన కేసీఆర్ దొరకు.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చారు రైతన్నలు. “రైతు దినోత్సవం” కంటే “రైతు దగా దినోత్సవం” అంటేనే కేసీఆర్ కు అబ్బుతుందని మండిపడ్డారు షర్మిల. రుణమాఫీపై, పంట పరిహారంపై బంధిపోట్లను నిలదీస్తుంటే కేసీఆర్ కు సిగ్గు కూడా అనిపించడం లేదంటూ రెచ్చిపోయారు షర్మిల.
అసలు కేసీఆర్ ఏం సాధించారని రైతు దినోత్సవాలు? లక్ష లోపు రుణమాఫీ అని చెప్పి, 31లక్షల మంది రైతులను మోసం చేసినందుకా? ఏటా 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని దగా చేసినందుకా? తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్నారు. పంట నష్టపరిహారానికి దిక్కులేదు. పంట బీమాకు మోక్షం లేదు. ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీ ఎరువులు, విత్తనాలు, యంత్ర లక్ష్మి వంటి రూ.30వేల రైతు పథకాలను బొంద పెట్టాడు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లించి, దర్జాగా మేపుతున్నాడని ఆగ్రహించారు.