ఒడిశా విషాదం.. ఆ చిన్నారులకు అదానీ, సెహ్వాగ్ ఉచిత విద్య

-

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే తాజాగా కొంత మంది ప్రముఖులు ఈ ప్రమాదంలో అనాథలైన పిల్లలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.

బిలీయనీర్‌, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, భారత క్రికెట్‌ మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఈ ఘటనతో అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.

“ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలుసుకుని మేమంతా తీవ్ర మనోవేదనకు గురయ్యాం. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతలను తీసుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. పిల్లల భవిష్యత్తుతోపాటు బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత” అని అదానీ ట్విటర్‌ వేదికగా తెలిపారు.

” ఈ విషాద ఘటనతో అనాథలుగా మిగిలిన పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తా. వారికి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్య అందిస్తా” అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి, స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చిన వారికి, వైద్య బృందాలకు సెల్యూట్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news