కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తీసుకు వస్తోంది. రైతుల కోసం కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 ని కేంద్రం జమ చేస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ అవుతున్నాయి.
రైతులకు ఇప్పటి వరకు 13 ఇన్‌స్టాల్‌మెంట్స్ జమ చేసింది. ఇక 14వ ఇన్‌స్టాల్‌మెంట్ ని జమ చెయ్యాల్సి వుంది. ఇక ఇవి ఎప్పుడు పడతాయనేది చూసేద్దాం.. త్వరలో 14వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ కావాలి. ఏప్రిల్-జూలై కాలానికి చెందిన వాయిదా ఇది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్ మేలోనే విడుదల అవ్వాలి. కానీ జూన్ మొదటి వారం గడుస్తున్నా పీఎం కిసాన్ 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇంకా ఏమి కూడా రాలేదు.
కొన్ని కథనాల ప్రకారము చూస్తే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జూన్ లోనే పడతాయి అని తెలుస్తోంది. పీఎం కిసాన్ 14వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ చేసే ఛాన్స్ ఈ నెల లోనే వుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ వాయిదా విడుదల చేయడానికి జూలై వరకు ఛాన్స్ ఉంది. మరి ఎప్పుడు వేస్తారో చూడాల్సి ఉంది.