తెలంగాణ నెంబర్ 1 గా నిలవడం వెనుక టీడీపీ ఉంది: చంద్రబాబు

-

ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి వెనుక టీడీపీ వేసిన పునాదే కారణమని సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలంగాణను పొగుడుతూ ఉందంటే అందుకు మేము చేసిన కృషి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా తెలంగాణ రాజధానిగా మనము అందరం పిలుచుకుంటున్న హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందడంతో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గర్వంగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఉన్నదే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల సంక్షేమం కోసమని గుర్తు చేశారు.

ఈ రెండు రాష్ట్రాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కరినీ ధనవంతులను చేయడమే టీడీపీ లక్ష్యం అని మెగా హామీ ఇచ్చారు. ఇంతలా ప్రజల కోసమే పనిచేస్తున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news