తెలంగాణలో నేడు బడులు పునఃప్రారంభం

-

వేసవి హాలిడేస్ ముగిశాయి. ఇక ఇవాళ్టి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత ఉన్నందున సెలవులు పొడిగించాలన్న వినతులను విద్యాశాఖ అంగీకరించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్, కేజీబీవీ పాఠశాలలన్నీ నేడే తెరుచుకుంటాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సెలవులు పొడిగిస్తున్నారనే తప్పుడు వార్తలు నమ్మొద్దని తెలిపారు. సోషల్ మీడియాలోని నకిలీ ఉత్తర్వులను నమ్మొద్దని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల బడుల్లో దాదాపు 58 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. సర్కారు బడుల్లో కొత్త తరగతిని ప్రారంభించేందుకు వస్తున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది పలు నూతన కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది  ఒకటి నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్, 6 నుంచి పదో తరగతి వరకు నోట్ బుక్స్‌ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయనుంది. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏటా ఒక తరగతికి విస్తరిస్తున్నారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి ఆంగ్లమాధ్యమం ప్రారంభం కానుంది. పదివేల బడుల్లో రీడింగ్ కార్నర్లను ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news