మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని BRS పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గారు.. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరేసారు.
నాగపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి అడుగుపెట్టారు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా నాగపూర్ డివిజన్ అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్ ను పార్టీ కార్యాలయంలో ఆసీనులను చేసి ఆశీర్వదించారు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా నాగపూర్ పార్టీ నేతలకు శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను ఇండియాలో అమలు చేయాలని కోరారు.