సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

-

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ గోవింద రాజస్వామి రథంకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు ధర్మారెడ్డి. రథాన్ని వెనకకు జరిపి పెట్టామన్నారు. మంటలకు దగ్ధమైన షాపుకు, రథంకు చాలా దూరం ఉందన్నారు. విష ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పది ఫైర్ ఇంజన్ లతో మంటలు అదుపులోకి తీసుకువచ్చామన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో పది ద్విచక్ర వాహనాలు, ఆరు దుకాణాలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news