సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం..యూపీ జైళ్లలో పెను మార్పులకు శ్రీకారం

-

.కేంద్రం తెచ్చిన కొత్త జైళ్ల చట్టం-2023 అమలు
.రాష్ట్రం తరపున కొత్త చట్టం తయారీపై కసరత్తు
.ప్రయోగాత్మకంగా ఓపెన్ జైల్ ఏర్పాటుకు సన్నాహాలు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నారో తెలిసిందే. అలాగే నేరస్తులను,మాఫియాలను కట్టడి చేసే విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో యోగీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నేరస్తులతో యూపీ జైళ్లు నింపేస్తున్న యోగీ.. ఇప్పుడు వాటి విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. జైళ్ల శాఖతో జరిగిన సమీక్షలో యోగీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

జైళ్ల పరిస్థితిని సమీక్షించిన యోగీ జైళ్లలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి రోడ్ మ్యాప్ ను రూపొందించారు. జైళ్లను ‘సుధార్ ఘర్’ (సంస్కరణ గృహాలు)గా మార్చాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.యూపీలో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చాలని సూచించారు.ఖైదీల భద్రత, వారి ఫిర్యాదులకు పరిష్కారం, జైలు అభివృద్ధి మండలి, ఖైదీల పట్ల వ్యవహరిస్తున్న ప్రవర్తనలో మార్పు వంటి అంశాలను చర్చించారు. మహిళల భద్రతకు అధిక ప్రధాన్యమిస్తున్న యోగీ మహిళా ఖైదీల విషయంలోనూ తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. వారికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుందన్నారు.ఇదే క్రమంలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వసతి కల్పించడం వంటి అంశాలపై అధికారులకు కీలక అదేశాలిచ్చారు.

అమలులో ఉన్న పాత జైళ్ల చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కేంద్రం రూపొందించిన మోడల్ జైలు చట్టం -2023ని అమలు చేయాలని చెప్పారు. ఖైదీల సంస్కరణ, పునరావాసం దృష్ట్యా ఈ మోడల్ చట్టం చాలా ఉపయోగకరంగా ఉందని యోగీ తెలిపారు. దీని ప్రకారం రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొత్త జైలు చట్టం తయారుచేయాలని నిర్ణయించారు. కొత్త జైలు మాన్యువల్‌కు యూపీ మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. జైలు సంస్కరణల్లో భాగంగా ఇదో గొప్పప్రయత్నమన్న యోగీ…..జైళ్లను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు గట్టి కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో “ఓపెన్ జైలు” ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రయోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని యోగీ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news