‘కేజ్రీవాల్‌ ఇంటి’పై కాగ్‌ ఆడిట్‌

-

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​కు కేంద్ర సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఆడిట్‌ జరపనుంది. మే 24వ తేదీన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) వీకే సక్సేనా పంపిన నోట్‌ ఆధారంగా కాగ్‌ ప్రత్యేక ఆడిట్‌కు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసింది.

గతంలోనే దిల్లీ సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎల్‌జీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని లేఖ రాశారు. దీనిపై తాజాగా చర్యలు తీసుకున్న కేంద్ర హోంశాఖ.. స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని కాగ్‌కు సూచించింది.

దిల్లీ సివిల్‌ లైన్స్‌లో ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని దిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రజాపనులశాఖ పునర్నిర్మించింది. దానికి మొదట రూ.20 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ తరువాత అంచనాలు పెంచుతూ మొత్తం రూ.53 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ఎల్‌జీ ఇప్పటికే ప్రధాన కార్యదర్శితో విచారణ జరిపించారు. తాజాగా కాగ్‌ ఆడిట్‌కు సిఫార్సు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news