అన్నం వండడానికి ముందు మనం బియ్యం లో నీళ్లు పోసి బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడుగుతూ ఉంటాము. మీరు కూడా మీ ఇంట్లో బియ్యాన్ని వండేటప్పుడు కడుగుతూ ఉంటారా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. అయితే ఇలా అన్నం వండడానికి ముందు బియ్యాన్ని కడగడం వెనక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఏ ఉంది అని పరిశోధన ద్వారా తెలుస్తోంది.
అన్నం వండడానికి ముందు బియ్యం ని ఒకటికి రెండుసార్లు కడగాలి ఎందుకు కడగాలంటే బియ్యం మీద దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. అలానే బియ్యం మీద లోహపు పొడి కూడా ఉంటుంది. ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదం. ఒకవేళ కనుక బియ్యాన్ని కడిగితే 90% వ్యర్థ పదార్థాలను తొలగిపోతాయని స్టడీ చెప్తోంది. కాబట్టి కచ్చితంగా ఈ వ్యర్థ పదార్థాలను తొలగించడానికి బియ్యాన్ని కడగాలి. కొన్ని రకాల బియ్యం జిగటగా ఉంటాయి.
ఇది పిండి పదార్థం వలన కాదు వంట సమయంలో విడుదలయ్యే అమిలోపాక్టాన్ కారణంగా ఈ జిగట అనేది ఏర్పడుతుంది బియ్యాన్ని కడగడం వలన 40 శాతం మైక్రో ప్లాస్టిక్స్ మనం వంట చేయడానికి ముందు బయటకు వెళ్ళిపోతాయి. అయితే బియ్యం కడగడం వలన రాగి ఐరన్ జింక్ వంటి పోషకాలు కూడా పోతాయి కాబట్టి కడగొచ్చు బియ్యాన్ని.. కానీ మరీ ఎక్కువ సార్లు కడగకండి. పోషకాలు కూడా పోతాయి. అప్పుడు అన్నం తినడం వలన ఉపయోగం ఏమీ ఉండదు.