ఆగస్ట్ 15 వరకు RRR చుట్టూ సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై మరో ఇంటర్ఛేంజ్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్ ఇంటర్ఛేంజ్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మెట్రో రైల్ ను విస్తరణ చేయాలని ప్లాన్ చేస్తున్నామని.. బీహెచ్ ఈఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో తీసుకు రాబోతున్నామని ప్రకటించారు. ఇండియాలో ఎక్కడ లేని విధంగా మురికి నీరు శుద్ది చేయబోతున్నామని… మొదటి ప్లాంట్ ను కోకపేట లో ప్రారంబిస్తున్నామని చెప్పారు. నాలుగు రోజుల్లో ఢిల్లీ కి వెళ్లి కేంద్రాన్ని కొన్ని విజ్ఞప్తులు చేశామమని… మెహదీపట్నం లో స్కై వాక్ ఏర్పాటు చేయాలని మొదలు పెట్టామని వివరించారు. పక్కనే ఉన్న ఆర్మీ భూములు అవసరం ఉన్నాయని.. ఆ భూముల పై కేంద్ర మంత్రి ని ఆడిగామని చెప్పారు కేటీఆర్.
Will also be throwing open a new interchange at Narsingi junction on the ORR today
This will be of a great relief to all the bustling areas near by pic.twitter.com/RGvS2S7Nhp
— KTR (@KTRBRS) July 1, 2023