BRS ఎవరికీ B టీం కాదు…ప్రజల సంక్షేమం చూసే A క్లాస్ టీం – హరీష్ రావు

-

BRS ఎవరికీ B టీం కాదు…ప్రజల సంక్షేమం చూసే A క్లాస్ టీం అన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న ఖమ్మం సభలో కేసీఆర్‌ సర్కార్‌ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్ అంటూ చురకలు అంటించారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీదంటూ ఫైర్‌ అయ్యారు. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందన్నారు. అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టిందని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదని…మాది పేద ప్రజలకు ఏ టీం ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news