సూపర్ స్కీమ్.. రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు..!

-

మంచి స్కీమ్ లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రిస్క్ లేకుండా రాబడిని పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ బెస్ట్. రిస్క్ లేకుండా అదిరే బెనిఫిట్ ని మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పొందవచ్చు. పీపీఎఫ్ పథకంలో చేరడం వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. ఇక మరి దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

money
money

ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇందులో డబ్బులు పెడితే భారీ రాబడి పొందొచ్చు. రిస్క్ ఏమి కూడా ఉండదు. మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఈ వడ్డీ మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని భావించే వారు దీనిలో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

నెలకు రూ. 3000 ఇన్వెస్ట్ అంటే అంటే రోజుకు రు.100 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 55 లక్షలు లభించే అవకాశం వుంది. 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించాలి. 25 ఏళ్లలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే 60 ఏళ్ల కి మీ చేతికి రూ. 55 లక్షలు వస్తాయి. మొత్తం రూ. 12.6 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి రూ. 42 లక్షలు.

 

Read more RELATED
Recommended to you

Latest news