మళ్లీ లవ్‌లో పడిన సామ్‌.. చెప్పకనే చెబుతూ పోస్ట్‌

-

సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. దశాబ్దానికి పైగా ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్నారు. స్టార్స్ తో జతకడుతూ స్టార్డం ఏమిటో నిరూపిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. గత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు సమంతకు చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండే సమంత.. నెట్టింట పెట్టే పోస్ట్‌లు ఒక్కోసారి పలు ఆలోచనలకు దారి తీస్తాయి. తాజాగా సమంత పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Samantha goes missing on social media, fans raise concerns

‘మరణం నుండి మనల్ని ఏదీ రక్షించకపోతే కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుండి కాపాడాలి’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ కోట్స్ సమంత షేర్ చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా సమంత ప్రేమలో పడిందని నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఇలాంటి కోట్స్ షేర్ చేస్తుంటే పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news