మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నాలుగు సంవత్సరాల బాలిక కృష్ణవేణి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కిరణా షాప్ లోకి వెళ్లిన చిన్నారి , తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు రాజేశ్వరి,భరత్ EWS కాలనీలో నివాసం ఉంటున్నారు.తండ్రి భరత్ వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తున్నాడు.
సీసీ కెమెరాలో సురేష్ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి వద్ద పాప ఉన్నట్లు గుర్తించిన పోలీసులు… డాగ్ స్క్వాడ్ మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక చిన్నారిని తీసుకెళ్తుండగా చూశారు అనిల్ మరియు స్థానికులు. రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో చిన్నారిని తీసుకెళ్తుండగా చూశామని.. తొమ్మిదిన్నర కు నాలుగేళ్ళ చిన్నారి కృష్ణవేణి కనిపించడం లేదని ఫ్రెండ్స్ చెప్పారన్నారు స్థానికులు అనిల్. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.