ఎన్నికల వచ్చాయి కాబట్టే చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకొస్తున్నారు – వెల్లంపల్లి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. ఆర్యవైశ్యుల పట్ల చంద్రబాబు కపట ప్రేమ వలకపోస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉండగా ఆర్యవైశ్యుల కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కొంతమంది ఆర్యవైశ్యులు టీడీపీలో చేరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. కావాలనే కొందరు ఆర్యవైశ్య మహాసభ పై బురద జల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్యుల మనోభావాల మేరకు చింతామణి నాటకాన్ని రద్దు చేశామని.. ఎవరెన్ని చేసినా ఆర్యవైశ్య మహాసభ చెక్కుచెదరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news