కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ బీఆర్ఎస్ లో ఆసమ్మతి రాగాలు మొదలయ్యాయి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి సొంత బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ పార్టీలో నెలకొన్న విభేదాలపై, కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు తుమ్మేటి సమ్మిరెడ్డి.
ఎన్నో గొప్ప పథకాలకు హుజురాబాద్ వేదికగా నిలిచిందని.. అలాంటి హుజురాబాద్ లో ప్రస్తూతం ఇంఛార్జ్ గా పని చేస్తున్న వ్యక్తి విఫలం అయ్యారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులు కేసీఆర్ కు చేరకుండా తప్పుడు సంకేతాలు చేరవేస్తున్నారని.. అందుకోసమే కేసీఆర్ కు లేఖ రాశామన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై విచారణ జరపాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. హుజురాబాద్ పరిణామాల గురించి తెలుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.