వైసీపీకి తూర్పులో చిక్కులు..జనసేన దెబ్బ ఎన్ని సీట్లలో తెలుసా?

-

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా..రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా..జనాభా ఎక్కువ ఉన్న జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉన్న జిల్లా ఇదే. అందుకే ప్రతి పార్టీ తూర్పుపై పట్టు సాధించాలని చూస్తూ ఉంటాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని పోటీ పడతాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం.

2014లో ఇక్కడ 19 సీట్లు ఉంటే టి‌డి‌పి 13, బి‌జే‌పి1, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. అప్పుడు రాష్ట్రంలో టి‌డి‌పిదే అధికారం. 2019లో వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. వైసీపీ అధికారం దక్కించుకుంది. ఇలా వైసీపీ హవా నడిచిన తూర్పులో ఇప్పుడు రాజకీయం మారిపోయింది. వైసీపీకి యాంటీగా మారింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ అన్నీ సీట్లు గెలవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడం..అసలు ఊహించని విధంగా జనసేన ఓట్లు చీల్చింది.

అయితే ఈ సారి ఆ పరిస్తితి కనబడటం లేదు. టి‌డి‌పి..జనసేన పొత్తులో ముందుకెళ్లెలా ఉన్నాయి. దీంతో వైసీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే జిల్లాలో పర్యటించిన పవన్..వైసీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వనని ఛాలెంజ్ చేశారు. ఇక నిజంగానే ఇక్కడ జనసేన దెబ్బ వైసీపీకి గట్టిగా పడేలా ఉంది. అసలు జిల్లాలో జనసేన ప్రభావం ఉన్న స్థానాలు ఎక్కువే. 20 వేల ఓట్ల నుంచి 40 వేల ఓట్ల వరకు వచ్చిన స్థానాలు చాలానే ఉన్నాయి.

గత ఎన్నికల్లో అలా జనసేన సత్తా చాటిన సీట్లు..పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజానగరం, రామచంద్రాపురం, అమలాపురం ఈ సీట్లలో భారీగా ఓట్లు చీల్చి వైసీపీ గెలుపుకు కారణమైంది. అయితే టి‌డి‌పి గెలిచిన పెద్దాపురం, మండపేట, రాజమండ్రి రూరల్, సిటీ స్థానాల్లో కూడా భారీగానే ఓట్లు తెచ్చుకుంది. ఇక రాజోలు సీటులో జనసేన గెలిచింది. అంటే మొత్తం మీద తూర్పులో 14 సీట్లలో జనసేన ప్రభావం ఉంది..గెలుపోటములని డిసైడ్ చేయగలదు. టి‌డి‌పి, జనసేన కలిస్తే ఈ 14 సీట్లని దక్కించుకునే ఛాన్స్ ఉంది. తుని, ప్రత్తిపాడు,అనపర్తి, రంపచోడవరం, జగ్గంపేట సీట్లలో ఓ 10 వేల చొప్పున ఓటు బ్యాంకు జనసేనకు ఉంది. వీటిల్లో టి‌డి‌పికి ప్రత్తిపాడు, జగ్గంపేట అనుకూలమైన సీట్లు అంటే..టి‌డి‌పి-జనసేన కలిస్తే 16 సీట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది.అది కూడా పొత్తు సక్సెస్ అయితే.

Read more RELATED
Recommended to you

Latest news