బ్రిటన్‌ చేరిన బైడెన్‌.. మిత్ర దేశాలను బుజ్జగించేందుకేనా..?

-

మిత్ర దేశాలను బుజ్జగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం రాత్రి బ్రిటన్‌ చేరుకున్నారు. ఇవాళ బైడెన్.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబుల సరఫరాపై ఆయన చర్చించే అవకాశం ఉంది. బ్రిటన్‌, కెనడా దేశాలు ఈ బాంబుల సరఫరాపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఉక్రెయిన్‌ ఆయుధ నిల్వలు పడిపోతుండటంతో ఈ రకం బాంబుల సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొందని అమెరికా చెబుతోంది. ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు సరఫరా చేస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. మర్నాడు మాత్రం యూకే పీఎం సునాక్‌ మాట్లాడుతూ.. క్లస్టర్‌ ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ జరిగిన ఒప్పందంపై యూకే సంతకం చేసిందని వ్యాఖ్యానించారు. మరో వైపు అమెరికా మిత్రదేశమైన న్యూజిలాండ్‌ కూడా క్లస్టర్‌ ఆయుధాల నిర్ణయంపై ప్రతికూలంగా స్పందించింది. ఇవి భారీ సంఖ్యలో అమాయకుల ప్రాణాలను తీస్తాయని హెచ్చరించింది.

ఇక బైడెన్‌ తన పర్యటనలో భాగంగా యూకే రాజు చార్లెస్‌తోనూ భేటీ కానున్నారు. ఆయన పట్టాభిషేకం తర్వాత బైడెన్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news