డీయాక్టివేట్‌ అయిన పాన్‌ కార్డులను ఇలా యాక్టివేట్‌ చేసేయొచ్చు తెలుసా..?

-

పాన్‌ కార్డు ఆధార్‌తో లింక్‌ చేయమని కేంద్రం కొన్నేళ్లుగా మొత్తుకుంటుంది. ఆ గడువును పోస్ట్‌ చేసుకుంటూ వస్తూ.. ఇక ఫైనల్‌గా జులై ఒకటితో సమాప్తం పలికింది. ఆ లోప పాన్‌ ఆధార్‌ లింక్ చేయని పాన్‌ కార్డులన్నీ ఇన్‌యాక్టివ్‌ అయిపోయాయి. ఆధార్ కార్డులతో లింక్ చేయని వ్యక్తుల పాన్ కార్డులను ఆదాయ పన్ను శాఖ డీయాక్టివేట్ చేసింది. డియాక్టివేట్‌ అయిన పాన్‌ కార్డులను మళ్లీ యాక్టివ్‌ చేసుకోవచ్చు.. అదేలా అంటే..

పాన్‌ కార్డు
పాన్‌ కార్డు

రూ.1,000 జరిమానా చెల్లించి వినియోగదారులు తమ కార్డులను మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ పేర్కొంది. రీయాక్టివేషన్‌ ప్రాసెస్‌కి సుమారు 30 రోజులు పడుతుంది.

పాన్ కార్డ్ యాక్టివేట్ అయిందో లేదో ఎలా చెక్‌ చేయాలి?

ముందుగా అధికారిక ఇ ఫైలింగ్‌ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportal/ లో లాగిన్ అవ్వండి.
తర్వాత ‘క్విక్‌ లింక్స్‌’ సెక్షన్‌లో ‘వెరిఫై యువర్‌ పాన్‌ డీటైల్స్‌’ అనే హైపర్‌లింక్‌ను సెలక్ట్‌ చేయండి.
ఇక్కడ పాన్‌, పూర్తి పేరు, పుట్టిన తేదీ, స్టేటస్‌ ఎంటర్‌ చేయండి. ఇమేజ్‌లో చూపిన విధంగా క్యాప్చా రాయండి.
తర్వాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి, పాన్ వివరాలను వెరిఫై చేయండి.

పాన్ కార్డ్‌ యాక్టివేట్ చేయడం ఎలా?

అధికారిక వెబ్‌సైట్‌ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయండి.
ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేయండి.
వివరాలను నింపి, “CHALLAN NO./ITNS 280″పై క్లిక్ చేయండి.
పేమెంట్‌ మోడ్‌ సెలక్ట్ చేసి అసెస్‌మెంట్ ఇయర్ (AY), పూర్తి అడ్రస్‌తోపాటు పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయండి.
తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి, సబ్మిషన్‌పై క్లిక్‌ చేయండి. పాన్ కార్డ్ యాక్టివేట్ కావడానికి గరిష్టంగా ఒక నెల పట్టవచ్చు.

pan-card

పాన్ కార్డ్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది?

వీటికి పాన్‌ తప్పనిసరి

డీమ్యాట్ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి నిర్దిష్ట ట్రాన్సాక్షన్‌లకు పాన్‌ నంబర్‌ అవసరం.
ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌(TDS), ట్యాక్స్‌ కలెక్టెడ్‌ సోర్స్‌(TCS)ను హైయర్‌ రేటుల కలెక్ట్‌ చేస్తారు, డిడక్ట్‌ చేస్తారు.
పాన్‌ పని చేయని సందర్భంలో రీఫండ్‌లు చేసే అవకాశం ఉండదు.

పాన్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే ట్యాక్స్‌ ఫైలింగ్‌, పేమెంట్‌ ప్రాసెస్‌లు సజావుగా జరుగుతాయి. అప్పుడే పన్ను చెల్లింపుదారులు అన్ని పన్నులను సరిగ్గా చెల్లించేలా ప్రభుత్వం నిర్ధారించగలదు. పన్ను ఎగవేత సమస్య తగ్గుతుంది. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్‌ చేయడం, మల్టిపుల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లను దాఖలు చేయడం, ఫేక్‌ ఐడెంటిటీస్‌ను ఉపయోగించి ఐడెంటిటీ థెఫ్ట్‌కి పాల్పడటం వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news