ఇండియా ఎ మరియు పాకిస్తాన్ ఎ జట్ల మధ్యన జరగ్గుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ను ఇండియా దారుణంగా దెబ్బ తీసింది. కనీసం పూర్తి ఓవర్ లను కూడా ఆడనీయకుండా, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లో 48 ఓవర్ లపాటు ఆడి 208 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఖాసీం అక్రమ్ ఒక్కడే 48 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఫర్హాన్ 35 పరుగులు మరియు ముబాషిర్ ఖాన్ 28 పరుగులు చేశారు. ఇక ఇండియా బౌలర్లలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న యంగ్ బౌలర్ హాంగార్గేకర్ 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఇతను ఎనిమిది ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఇతనికి మానవ్ సుతర్ మూడు వికెట్లు నుండి చక్కని సహకారం లభించింది. ఇప్పుడు ఇండియా ముందు 209 పరుగుల లక్ష్యం ఉంది.