BREAKING : తెలంగాణ-కర్ణాటక మధ్యలో నిలిచిపోయిన రాకపోకలు

-

BREAKING : తెలంగాణ-కర్ణాటక మధ్యలో నిలిచిపోయాయి రాకపోకలు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి పొంగిపొర్లుతున్నాయి వాగులు, వంకలు. తాండూర్ మండలంలో ఉదృతంగా పొంగిపొర్లుతోంది ఐనెల్లి వాగు.

దీంతో తెలంగాణ—కర్ణాటక మధ్యలో నిలిచిపోయాయి రాకపోకలు. కరణ్ కోర్టు….బెల్కటూర్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. పెద్దేముల్ మండలంలో పొంగిపొర్లుతోంది ఘాజీపూర్ వాగు. దీంతో తాండూర్ — సంగారెడ్డి వెళ్లే దారిలో నిలిచిపోయాయి రాకపోకలు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాగులు, రహదారుల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news